నటుడు వేణుమాధవ్ కోదాడ నుంచి పోటీ

0

సినీ నటుడు వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపాడు. ఈరోజు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే. విద్యాభాసం పూర్తయిన తర్వాత మిమిక్రి ఆర్టిస్ట్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ సభల్లో మిమిక్రీ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత సినిమాలలో ఛాన్సులు రావడంతో… నటుడిగా బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేయడానికే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు.

Share.

About Author

Leave A Reply