90 కోట్ల నగదుతోపాటు.. 100 కేజీల బంగారం

0

tirumala-tiruapti-apduniaదేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే వరకు ఇన్ కం ట్యాక్స్ అధికారుల దాడుల్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్దది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యులు, చెన్నైలోనే అతి పెద్ద కాంట్రాక్టర్ అయిన శేఖర్ రెడ్డిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని టీనగర్, అన్నానగర్ ఏరియాల్లోని శేఖర్ రెడ్డికి సంబంధించిన బంధువులు, ఆప్తులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. దాడుల్లో 90 కోట్ల రూపాయల నగదు బయట పడింది. ఇందులో 70 కోట్ల రూపాయలు కొత్త రూ.2వేల నోట్లు కావటంతో దేశం మొత్తం నోరెళ్లబెట్టింది. ఓవైపు సామాన్యుడు కొత్త నోట్ల కోసం.. నాలుగు వేల నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం క్యూలో పడిగాపులు పడుతుంటే.. శేఖర్ రెడ్డి దగ్గర 70 కోట్ల రూపాయల 2వేల నోట్లు ఎలా వచ్చాయి అనేది ఐటీ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. 90 కోట్ల నగదుతోపాటు.. 100 కేజీల బంగారం కూడా బయటపడింది. ఇంట్లో పాత నోట్లు 20 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వీటిని కూడా మార్చుకోవటానికి ఇప్పటికే పక్కా ప్లాన్ తో ఉన్నాడంట. శేఖర్ రెడ్డితోపాటు… ఆయన స్నేహితులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ లను ప్రశ్నిస్తున్నారు ఐటీ అధికారులు. 70 కోట్ల రూపాయల 2వేల నోట్లు ఎలా వచ్చాయి.. మార్పిడి వెనక ఎవరు ఉన్నారు.. ఏయే బ్యాంకుల నుంచి వీటిని తీసుకొచ్చారు అనే విషయాలపై వివరాలు రాబడుతున్నారు. సహకరించిన బ్యాంక్ అధికారులనూ త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.టీటీడీ బోర్డ్ సభ్యుడు అయిన శేఖర్ రెడ్డి చెన్నైలో పెద్ద కాంట్రాక్టర్. జయలలితకు సన్నిహితుడు. తమిళనాడు ప్రభుత్వ భవనాలు అన్నీ శేఖర్ రెడ్డి నిర్మిస్తూ ఉంటారు. తమిళనాడు అధికార పార్టీ AIADMKకి సన్నిహితుడు. జయలలిత చనిపోయిన మూడో రోజే ఈ దాడుల జరగటంతో తమిళనాడు రాజకీయాల్లో సంచలనం అయ్యాయి. చర్చకు దారి తీసింది.

Share.

Comments are closed.