నగరంలో ఏర్పాటు కానున్న 66 ఇంటిగ్రేటెడ్ వాష్ రూమ్లు దేశంలోనే మొట్ట మొదటి ఉచితంగా ఎ.సి టాయిలెట్ల ఏర్పాటు

ఏవిధమైన యూజర్ చార్జీలు వసూలు చేయవద్దని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్ సూచించడంతో తాజాగా పిలిచిన టెండర్లకు విశేష స్పందన లభించింది. నగర ప్రజలకు ప్రధానంగా సామాన్య ప్రజలకు టాయిలెట్లు అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ఆకాంక్షల మేరకు నగర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్ రూమ్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి నిర్ణయించింది. దీనిలో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో స్మార్ట్ టాయిలెట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసి ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తుంది. ఈ స్థలంలో జీహెచ్ఎంసీ సూచించిన డిజైన్ మేరకు ఇంటిగ్రేటెడ్ వాష్ రూంలను ఏర్పాటు టెండర్లు పిలవగా తొలిదశలోనే 66 ప్రాంతాల్లో ఏర్పాటుకు బిడ్డర్లు ముందుకు వచ్చారు. ఈ 66 స్మార్ట్ వాష్ రూమ్లను 2018 నవంబర్ వరకు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
టాయిలెట్ల నిర్వహణ సవాలుతో కూడుకున్నప్పటికీ తమమ స్వంత వ్యయంతో నయా పైసా యూజర్ చార్జీలు లేకుండా మహిళల భద్రతతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ ఇంటిగ్రేటెడ్ టాయిలెట్లను ఇంత భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటి నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. ఈ స్మార్ట్ వాష్ రూమ్లో ఏర్పాటు చేసే టాయిలెట్లలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ప్రవేశం ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఈ టాయిలెట్లలో నీరు, ర్యాంపులు, నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్లో మరిన్ని టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రధాన కూడళ్లలో జీహెచ్ఎంసికి ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్దతిన టెండర్లను ఆహ్వానించి ఖరారు చేసింది. ఈ ఆధునిక స్మార్ట్ వాష్రూమ్లో ఎయిర్ కండీషన్తో కూడిన టాయిలెట్లు, నాప్కిన్ వెండింగ్ మిషన్లు, నాప్కిన్ ఇన్సినరేషన్, కిడ్స్ డైపర్ చేంజ్ రూం, కేఫే, వైఫై సౌకర్ం, వాటర్ ఏటిఎం, బ్యాంకు ఏటిఎం తదితర సౌకర్యాలు ఉంటాయి.
స్మార్ట్ టాయిలెట్ల ఏర్పాటుకు కావాల్సింది.
* 33 ఫీట్ల సైజులో ముందుగా నిర్ణయించిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్
* పురుషులు, స్త్రీలు, వికలాంగులకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యం
* మొత్తం ఫ్రీ ఫ్యాబ్రికెటెడ్ ఎ.సి సౌకర్యం
* అదనపు స్థలంలో కాఫీ షాపు, ఏటిఎంల ఏర్పాటు
* నిర్వహణ బాధ్యత ఏజెన్సీదే
* కాఫీ షాపు, ఏటీఎం ప్రకటనల ద్వారా లూ-కేఫేలు ఆర్థిక నిర్వహణ వ్యయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com