50 రోజుల్లో ఐటీకి దొరికింది నాలుగున్నర వేల కోట్లు

0
income-tax-apduniaపెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ మొత్తం ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు సమాచారం. అంతేకాకుండా తాజాగా గుర్తించిన లెక్కచూపని వాటిల్లో రూ.562కోట్లను సీజ్‌ చేసినట్లు కూడా తెలిసింది.వీటిల్లో రూ.110కోట్లు కొత్త నోట్లు ఉన్నాయట. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 253 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, 556 సర్వేలు చేసినట్లు, 289 చోట్ల సీజ్‌ చర్యలు తీసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. పన్నులకు సంబంధించి మొత్తం 5,062 నోటీసులు పంపించినట్లు కూడా వెల్లడించాయి. అంతకుముందు డిసెంబర్‌ 22నాటికి ఐటీ అధికారులు గుర్తించిన లెక్క చూపని ఆదాయం రూ.3,185కోట్లు. ఈ మొత్తాన్ని కూడా అప్పుడే వారు సీజ్‌ చేశారు.
Share.

Comments are closed.