245 కోట్లతో వైజాగ్ లో ఐహబ్

విశాఖపట్టణం ఆగస్టు1 (న్యూస్ పల్స్)
శాస్త్రీయ పరిశోధనలకు అత్యాధునిక టెక్నాలజీతో గ్లోబల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ‘ఐ-హబ్‌’ (ఇంటిలిజెంట్‌ హబ్‌)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఎంతో ఆధునికత సంతరించుకునే ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో రూ.245 కోట్ల పెట్టుబడితో చేపట్టి ఐదేళ్ళపాటు విస్తరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. యునెస్కో మహాత్మాగాంధీ శాంతి, సుస్థిర అభివృద్ధి విద్యాసంస్థతో కలిసి ఐ-హబ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవలె ఎంవోయూ కుదుర్చుకుంది. విద్యాసం స్థలు, పాఠశాలలకు అవసరమైన శాస్త్రీయ అవగాహన పెంచేందుకు ఐ-హబ్‌ కార్యక్రమాలు రూపొందించనుంది. ఈ సంస్థ గ్లోబల్‌ డిజైన్‌ యూనివర్సిటీ నిర్వహించేందుకు కూడా ఈ సంస్థకు అనుమతి పొందనుందని అధికార వర్గాలు తెలిపాయి.ప్రపంచ విద్యకు 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉన్నప్ప టికీ, కేవలం 2 శాతం మాత్రమే డిజిటలైజ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐ-హబ్‌ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రామీణ పాఠశాలల పిల్లలకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఏటా కనీసం 50వేల మందిని తీర్చిదిద్దనున్నారు. అలాగే పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే పిల్లలను తగ్గించేందుకు, అలాగే ఎడ్యుకేషన్‌ టెక్నాలజీని అందిం చేందుకు ఐ-హబ్‌ దోహద పడు తుందని భావిస్తున్నారు. ఐ-హబ్‌ ఏర్పాటుకు 30 లక్షల డాలర్లు వ్యయం కానుం డగా, నిర్వహణకు ఏటా 22 లక్షల డాలర్లు ఖర్చవుతుం దని అంచనా వేశారు.కన్సల్టెన్సీ సర్వీసులు, పబ్లికేష న్స్‌, సెమినార్లు, పేటెంట్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టు పెట్టుబడులను తిరిగి సమ కూర్చుకునే అవకాశాలు ఉన్నా యని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 40 మంది అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధకులను నియమించనున్నారు. ఇందులో న్యూరో సైన్స్‌, విద్య, మానసికతత్వ శాస్త్రం, డిజిటల్‌ ఇన్‌స్ట్రక్చనల్‌ డిజైన్‌, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డేటా సైన్సెస్‌, గేమింగ్‌లు నిపుణులను నియమించనున్నట్లు తెలిపారు. ఐ-హబ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌గా కేంద్ర ప్రభుత్వం గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com