సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్

0
chandrababu-naidu-ap-fiber_apduniaరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫైబర్‌నెట్ సేవలు అందించడానికి  కేబుల్ ఆపరేటర్లందరూ సిద్ధమౌతున్నారు. ప్రభుత్వం నుంచి సిగ్నల్ కర్నూలు నగరంతో పాటు ప్రధాన పట్టణాలకు వచ్చిందన్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వీడియోకాల్, పలు టీవి ఛానళ్లను పరీక్షించి చూశామని, ఇంటర్‌నెట్ వేగం, టీవి ప్రసారాల నాణ్యత సంతృప్తినిచ్చిందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెట్ టాప్ బాక్సుల నాణ్యత ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న వాటికంటే బాగా ఉన్నాయన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు ఇతర పురపాలక సంఘాల్లో సంక్రాంతి నుంచి ప్రజలకు కనెక్షన్ ఇస్తామన్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఫైబర్ నెట్ సేవలు అందజేస్తామని తెలిపారు. అతి తక్కువ ధరకే ఇంటర్‌నెట్, కేబుల్ టీవి, టెలిఫోన్ సదుపాయం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్‌నెట్ కార్యక్రమం చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుందని వివరించారు. ఫైబర్ నెట్ కేబుల్ అందించడానికి ఏపిఎస్‌ఎఫ్‌ఎల్ అధికారులు జిల్లాలో 2,134 కి.మీ మేర కేబుల్ లాగారని, 49 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం అత్యధిక వేగంతో ఇంటర్‌నెట్, హెడ్‌డి నాణ్యతతో టీవి ప్రసారాలు అందనున్నాయన్నారు. ఇక ఈ రంగంలో ప్రజలకు ఇస్తున్న టెలిఫోన్ నుంచి ఇదే నెట్‌వర్క్‌లోని ఏ ఫోన్‌కు చేసుకున్నా ఉచితం అని తెలపారు. జిల్లాలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌నెట్ సదుపాయం కల్పిస్తుండటంతో ఆయా శాఖల అధికారులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చని తెలిపారు. 
 
 
 
Share.

Comments are closed.