వెష్ణవాలయాల్లో ధనుర్మాస పూజలు ప్రారంభం

0

dhanurmasam_apduniaధనుర్మాసం కావడంతో వెష్ణవాలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 14న గోదాదేవి కల్యాణంతో ధనుర్మాసం పూజలు ముగించనున్నట్లు వైష్ణవారాధకులు తెలిపారు. ధనుర్మాసంలో తులసిదళానికి విశిష్టత ఉంది. పర్యావరణానికి, మాన వాళికి తులసి అమృతవర్షిణిగా భావిస్తారు. తులసిదళాన్ని పూజించడం ద్వారా పుణ్యఫలాలు సమృద్ధిగా సమకూరతాయని నమ్మకం. అందుకే ఆలయాలలో భక్తులు లక్ష తులసిదలార్చనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మాసాంతరం వరకు ఆలయాలలో విశిష్ట పూజలు చేపడతారు. తులసిమాలతో స్వామివార్లను ఆరాధించే పవిత్ర మాసం ఇది. చక్కెర పొంగళి, పులిహోర, దద్దోజనం స్వామివార్లకు నివేదనలు చేస్తారు. తొలికోడిని తానే మేల్కొలిపి వణికించే చలిని పక్కకు నెట్టి హరిలో రంగహరి అని శ్రావ్యంగా రాగాలకు లయబద్ధంగా అడుగులు కలిపే డూడూ బసవన్నల విన్యాసాలు, పిండి వంటల ఘుమఘుమలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేర్చే రైతుల లోగిళ్లలో రంగవల్లులు దిద్దే తెలుగింటి ఆడపడుచుల అలజడితో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ మాసం నిలుస్తోంది. ఓ వైపు ఆలయాల్లో పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంటాయి. మరోవైపు మహిళలు, పల్లెపడుచుల రంగవల్లులతో పల్లెలు కళకళలాడతాయి. ధనుర్మాసంలో ఆనందం, ఆహ్లాదం కలిగించే వాతావరణంతో శాస్త్రీయంగా ఎంతో ఉత్తమమని పండితుల అభిప్రాయం. ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి అత్యంత పర్వదినంగా భావిస్తారు. జనవరి 6న ఈ పర్వదినాన వెష్ణవాలయాలలో ఉత్తర ద్వారం తెరుస్తారు. శ్రీమహా విష్ణువు ఏడాదిలో ఒక్కదినం భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం ఇస్తారు. ఆ రోజు ఆలయాలు భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటాయి.

Share.

Comments are closed.