వెయ్యి కోట్ల వెంకన్న

0

tirumala_apduniaగతేడాది రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడికి కానుకల వర్షం కురిపించారు. 2016 సంవత్సరంలో 2.55 కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే హుండీ ద్వారా రూ. 85 కోట్ల ఆదా యం లభించగా… గత ఏడాది కంటే అదనంగా 20.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా గత ఏడాది కంటే అదనంగా 114కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో వచ్చింది. ఏడాదిలో 1,018 కోట్ల రూపాయలను భక్తులు హుండీలో సమర్పిం చారు. 10.34 కోట్ల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు ఈవో సాంబశివ రావు తెలిపారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరాయంగా భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందిం చేలా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఈనెల 8న ఉదయం 9గంటలకు తిరువీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారి వూరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 8,9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. కనుమ పండుగ రోజున టీటీడీ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహించనున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. అలాగే 2016లో శ్రీవారిని 2 కోట్ల 66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. గత ఏడాది కంటే అదనంగా 20.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కాగా గత ఏడాది కంటే అదనంగా 114 కోట్ల ఆదాయం

Share.

Comments are closed.