విదేశీ గడ్డలపై భారత నటులకు ప్రాధాన్యం పెరిగింది

0
sonu_sood_apduniaబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సోనూ సూద్ ఒకరు. ప్రతినాయకుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన పాత్రలకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. కొన్ని నెలల క్రితమే ‘దేవి’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన సోనూ త్వరలోనే ఓ అంతర్జాతీయ చిత్రం ‘కుంగ్ ఫు యోగా’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ‘కుంగ్ ఫు యోగా’లో సోనూ ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జాకీచాన్ లాంటి స్టార్ తో నటించడంపై ఆనందం వ్యక్తం చేసిన మన ‘దూకుడు’ విలన్ భారతీయ నటనను విదేశీ గడ్డ ఆదరిస్తోందని అన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇండియన్ నటీనటులకు అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. 
“ప్రస్తుతం విదేశాల్లో భారత నటీనటులకు ఆదరణ లభిస్తోంది. ఈ రంగంలో అనేక ద్వారాలు తెరిచే ఉన్నాయి. మంచి పాత్రలు మనకు ఇస్తున్నారు. ఈ సరికొత్త పరిణామం నటులకు అనేక వేదికలు సృష్టిస్తోంది. ఇదో సానుకూల సంకేతం” అని భారతీయ యాక్టర్స్ విదేశీ చిత్రాల్లో నటించడంపై అభిప్రాయపడ్డారు సోనూ. ఇక బాలీవుడ్ కు హాలీవుడ్ తో ప్రమాదం ఉందన్న విశ్లేషణపైనా తన అభిప్రాయం చెప్పారాయన. ఆంగ్ల చిత్రాలతో బాలీవుడ్ కు ఎలాంటి ప్రమాదం లేదని, మనదైన కథలకు ఆదరణ లభిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే ‘కుంగ్ ఫూ యోగా’ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సోనూకు జాకీచాన్ నుంచి ఊహించని బహుమతి లభించింది. జాకీచాన్ తన బాక్సింగ్ గ్లోవ్స్ పై సంతకం చేసి, ఓ మెసేజ్ కూడా రాసి వాటిని సోనూకు బహూకరించారు. సోనూ ఫిట్ నెస్ కు ముగ్ధుడయ్యే జాకీ తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారట.  
Share.

Comments are closed.