వాన కోసం ఎదురుచూపులు

వరుడుకోసం అన్నధాతలు ఎదురు చుాపులు ,జులైలో సాదరనంకంటే  తక్కువ వర్షపాతం కావడంతో రైతున్న గుండెలో గుబులు  తో దిక్కతోచని స్తితిలో,రైతన్నలు,  వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లోని  రైతులపై  వరుణ దేవుడు కన్నేర్ర చేశాడు  గతమూడేళ్ల లాగే ఈ ఏడు మొదటిలోనే కురిసిన వర్షాలకు రైతన్నల ఆశలు చిగురించాయి.  వాతావరణ శాఖ ముందే ప్రకటించడంతో  అన్నదాతలు ఖరీప్ పంటలను సాగుచేశారు.  జూన్ ప్రారంభంలో నే పర్వాలేదు అనిపించిన వర్షాలు  సాగులు చేసిన తరువాత  కనిపించకపోవడంతో రైతుల ఆశలు నిరాశలుగా మారాయి.  అడపా దడప వర్షాలు రావడంతో  రైతులు పంటలు వేయడంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు సకాలం లో రాకపోవడంతో  రెండు మూడు సార్లు పంటలు వేసి నష్టపోయిన రైతన్నలు  అయోమయంలో వన్నారు. ఒక్కో రైతు ఒక ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే  చివరకు నిరాశే మిగిలింది. మందుల షాప్ లో పంటలకోసం తెచ్చిన అప్పులు  కట్టలేక సతమతమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com