రూ.600 కోట్లతో మోహన్ లాల్-నాగార్జున ‘మహాభారతం’?

0

Nagarjuna-meets-Mohan-Lal_apduniaఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్ ను సినిమాగా తెరకెక్కించే ప్రతిపాదన వినిపిస్తోంది మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి. ‘రంధమూలం’ మహాభారత గాథలోని కొన్ని పర్వాలను ఆధారంగా చేసుకుని మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన నవల ఇది. కురుపాండవులే ఈ రచనలో ప్రధాన పాత్రధారులు. దీన్ని సినిమా తీసుకొచ్చే ఉద్దేశం ఉంది మోహన్ లాల్ కు. మూడేళ్ల కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా ఎందుకో పట్టాలెక్కలేదు. తాజాగా లాల్ మాట్లాడుతూ ‘రంధమూలం’ ను సినిమాగా తీసుకొస్తానని వ్యాఖ్యానించాడు. దానికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించడమే ఇక్కడ అత్యంత విశేషం. భారత దేశ సినీ చరిత్రలోనే ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన సినిమాలేవీ ఇంత వరకూ లేవు. ఇదే జరిగితే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది. నవల భీమసేనుడు ప్రధాన పాత్రగా సాగుతుందట. ఆ పాత్రను మోహన్ లాల్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో భీష్ముడి పాత్రకు అమితాబ్ ను, అర్జునుడి పాత్రకు విక్రమ్ ను, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యరాయ్ ను తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యపాత్రను చేయబోతున్నాడట. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ప్రతిపాదన ఉందని సమాచారం. మరి అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిపాదనలో ఉన్న ఈ మహాభారతగాథ ఏ మేరకు పట్టాలెక్కుతుందో చూడాలి.

Share.

Comments are closed.