రక్షకులే భక్షకులైతే : 16 మంది గిరిజన మహిళలపై పోలీసుల అత్యాచారం

0

rape3_apdunia16 మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన రిపోర్టును ఎన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిన్న వెల్లడించింది. భద్రతా సిబ్బంది చేతిలో లైంగిక వేధింపులకు గురైన మరో 20 మంది గిరిజనుల స్టేట్‌మెంట్‌ను కమిషన్ రికార్డు చేసింది. బీజాపూర్ జిల్లా పెద్దపల్లి, చిన్నగెలూర్, పెద్దగెలూర్, గుండం, బూర్గిచెరు గ్రామాల్లోని మహిళలపై నవంబర్ 2015న భద్రతా సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డట్లుగా తెలిపింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు పంపింది. లైంగిక ఆరోపణలు, అత్యాచారం, భౌతిక వేధింపులకు సంబంధించి మొత్తం 34 ఎఫ్‌ఐఆర్‌లను కమిషన్ గుర్తించింది. 15 మంది బాధిత మహిళల రికార్డును నమోదు చేసి పంపాల్సిందిగా దర్యాప్తు అధికారి డీఐజీని ఆదేశించింది. దర్యాప్తు సిబ్బంది, న్యాయ బృందంతో విచారణ జరిపి నెలలోపు నివేదికను కమిషన్‌కు సమర్పించాల్సింది ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మరో 19 మంది బాధిత మహిళల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి పంపించాల్సిందిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(సీఐడీ)ని కమిషన్ ఆదేశించింది. బాధితులంతా గిరిజనులే కావునా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందిగా పేర్కొంది.

Share.

Comments are closed.