మైనింగ్ మాఫియా పై చర్యలు ఏవి ?

0
cpm party_APDUNIAకర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం  లో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ మాఫియా పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సిపిఐ పార్టీ ఆద్వర్యం లో ర్యాలీ చేసి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. గతం లో సైతం ప్యాపిలి, బేతంచర్ల మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న గనులలో అమాయక  కూలి లైన పేద ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ,అంతే కాకుండా పరిసర ప్రాంతాల రైతుల పొలాలకు తీవ్ర ఇబబందులతో పంటలు పండడం లేదని వాపోతున్న రాజకీయ నాయకుల అండ దండలతో ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు అక్రమ మైనింగ్ దారులకు వంత పాడుతున్నారు .కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సైతం పట్టి పట్టనట్లుగా వ్యవహరించడం వల్ల వారి అక్రమాలకూ అడ్డు అదుపు లేకుండా పోతుందని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు .రాయల్టీలు జారీ చేసే అద్దికారులు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి వెలికి తీసిన ఖనిజాన్ని లెక్క  కట్టి నిబంధనలకు లోబడి ఇవ్వ వలసిన రాయల్టీలను విచ్చల విడిగా ఇవ్వడం వల్లే వారి వ్యాపారాలు సజావు గా సాగి పోతున్నాయి. పరిశ్రమలు నడుపుతున్న ప్రాంతాలలో అభ్యన్తరాలు వెల్లువెత్తుతున్నప్పటికీ వారి పరిశ్రమల పై ఎటువంటి చర్యలు లేకపోవడమే ఒక నిదర్శనం .వెనువెంటనే అక్రమ మైనింగ్ చేస్తున్న మాఫియా పై చర్యలు తీసుకొని ,వెంటనే వాటిని సీజ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించారు.
Share.

Comments are closed.