మైనరుపై లైంగికదాడికి పాల్పడిన ఎమ్మెల్యే అరెస్ట్‌

0

arrest_apduniaమైనరుపై రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన మేఘాలయ ఎమ్మెల్యేను అస్సాంలో శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. హోం మంత్రి హెచ్‌ఆర్‌డీ లింగ్డో అతిథి గృహంలో ఒకసారి, ఓ రిసార్టులో మరోసారి ఆ బాలికపై స్వతంత్ర ఎమ్మెల్యే జులియస్‌ డోర్ఫంగ్‌ (52) లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గువహతిలో డోర్ఫంగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం షిల్లాంగ్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన్ను సాదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. నిషేధిత తీవ్రవాద సంస్థ హెచ్‌ఎన్‌ఎల్‌సీకు గతంలో ప్రాతినిథ్యం వహించిన డోర్ఫంగ్‌ వారితో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనుప్‌ చేతియా ఈ ఆరోపణలను తోసిపు చ్చారు. ‘ఇది పూర్తిగా తప్పు. కూతురులాంటి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అలాంటి వ్యక్తులను మేం ఎప్పుడూ సమర్థించం’ అని అనుప్‌ స్పష్టం చేశారు. 2007లో పోలీసుల ఎదుట లొంగిపోయిన డోర్ఫంగ్‌ రాజకీయాల్లో ప్రవేశించాడు. 2013 లో మవహతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు. కాగా ఇది పెద్ద సెక్స్‌ రాకెట్‌ అని, దీనితో పలువురు ‘పెద్దలకు’ సంబంధముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.