మార్పింగ్ కు గురైన చంద్రబాబు అధికారిక ట్విట్టర్

0

chandra2_apduniaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ట్విట్టర్ అకౌంట్ మార్పింగ్ కు గురైంది. ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ లో ఆయన తనయుడు నారా లోకేష్ ట్వీట్స్ చేసినట్లు కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అవి మార్ఫింగ్ చేయబడినవిగా ప్రభుత్వం చెబుతోంది. తాము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా కొడాలి నాని పేరుతో ఈ విషయంపై లోకేష్ ని విమర్శిస్తున్నట్లు ఉన్న పోస్ట్ లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంపై లోకేష్ కొద్ది సేపటి క్రితం తన స్పందనని ట్విట్టర్ లో తెలియజేశాడు. అవే కామెంట్లు ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Share.

Comments are closed.