బ్లేడుతో గొంతుకోసుకున్న "మెగా" అభిమాని

0

chiru fan_apduniaచిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద ఒక అభిమాని చేసిన పని అందరికీ షాకిచ్చింది. విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్దకు ఒక అభిమాని సినిమా చూడటానికి వచ్చాడు. అతడికి టిక్కెట్ దొరకలేదు. తీవ్ర మనోవేదనతో పాటు ఆగ్రహానికి గురైన ఆ అభిమాని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీన్ని అభిమానం అనాలా లేక పిచ్చి పని అనాలా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే ఆ సమయంలో ఈ అభిమాని మద్యం మత్తులో ఉన్నాడు. అప్పటికే టిక్కెట్ దొరకలేదని వీరంగం ఆడుతూ ఆడుతూ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. మెడకు గాయమై రక్తమోడుతున్న అతన్ని ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇదే క్రమంలో అతనిని ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి అక్కడున్నవారంతా ఎంత ప్రయత్నించినా అతడు అంగీకరించలేదు సరికదా… తనకు టిక్కెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళతానని, లేకుంటే ఇక్కడే చచ్చిపోతానని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మూర్ఖపు వాదన అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆ అభిమానిని అదుపు చేశారు.

Share.

Comments are closed.