ఫ్యాక్షన్ హత్యకేసులు ఎనమిదిమందికి యావజ్జీవం

0

moists2_apduniaఆరేళ్ల క్రితం జరిగిన ఒక ఫాక్షన్ హత్య కేసులో ముద్దాయిలకు జీవిత కారాగార శిక్ష పడింది. కర్నూలు జిల్లా అస్పరీ మండలం అట్టకేకల్ గ్రామంలో 2011 ఆగస్టు 17 న రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ పోరు జరిగింది. ఈ ఘర్షణలో బోయ అంజనేయ చనిపోయడు. వైరి వర్గానికి చెందిన ఎనమిదిమందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. కేసును విచారించిన ఆదోని రెండవ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులందరికి యావజ్జీవ ఖైదు విదిస్తూ తీర్పునిచ్చారు. నిందితులు బోయ పత్తికొండ జయరాం, లక్ష్మన్న, నరసన్న, చిన్న నరసన్న, నునేపతి, లింగన్న, పెద్ద సంజన్న, చిన్న సంజన్నలకు తలా నాలుగు వందల రూపాయల జరిమానా కుడా విధించారు. ఒక ఫ్యాక్షన్ హత్య కేసులో అందరు ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడం ఇదే మొదటిసారి. నిందితులందరిని గట్టి బందోబస్తుతో జైలుకు తరలించారు.

Share.

Comments are closed.