పార్టీ తర్వాత అలా చేయడం అస్సలు నచ్చదు

0
sonam_kapoor_apduniaబాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఫ్యాషన్ సెన్స్ ఆమె అభిమానులకే కాక నటీనటులనూ కట్టిపడేస్తుంది. నలుగురిలో స్పెషల్ గా కనిపించడంలో ఆమెకు ఆమే సాటి. డిజైనర్ వేర్ సెలక్ట్ చేసుకోవడంలో వస్త్రాలను ప్రజెంట్ చేయడంలో సోనమ్ ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి.  మొత్తంగా తనదైన స్టైల్ స్టేట్మెంట్ తో అందరినీ కట్టిపడేస్తూ పార్టీల్లో హల్ చల్ చేస్తుంటుంది ఈ ‘నీరజ’ స్టార్. అయితే పార్టీల తర్వాత ఆమెకో పని చేయడం అస్సలు నచ్చదట. ఓ రకంగా అసహ్యించుకుంటుందట. అదేంటో ఆమె మాటల్లోనే, “పార్టీ గురించి నాకు నచ్చే విషయం ఏమిటంటే చక్కగా తయారవడం. నచ్చని విషయం ఏమంటే, నేను ధరించిన అందమైన వస్త్రాలు, మేకప్ తీసేయడం”. పార్టీకి తయారవడానికి సాధారణంగా ఎవరికైనా ఎక్కువ టైమే పడుతుంది. అదే సెలబ్రిటీలైతే చాలా సమయమే పడుతుంది. వేడుకలో ఎంత టైమ్ ఉన్నారన్న సంగతి పక్కనపెడితే పార్టీ ముగిసిన తర్వాత ఎవ్వరైనా మేకప్ తొలగించాల్సిందే. లేదంటే చర్మం పాడవుతుంది. ఈ విషయాలు సోనమ్ కు తెలియంది కాదు. కానీ సౌందర్యానికి తాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాన్న ఉద్దేశంతోనే డిజైనర్ వేర్ నుంచి బయటకు రావడం తనకసలు ఇష్టంలేని విషయమని చెప్పుకొచ్చింది. 
Share.

Comments are closed.