పన్నీర్ సెల్వం, శశికళ మధ్య బీజేపీ చిచ్చు

0

selvam-sasi-venkaiah_apduniaజయలలిత మరణంతో తమిళనాడు మీద కేంద్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎఐఎడిఎంకె పార్టీని రెండుగా చీల్చి తమిళనాట చక్రం తిప్పాలన్న యోచన బిజెపి పెద్దలు చేస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం – ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని పావులు కదుపుతోందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. తమిళనాట తాము బలపడతామని చెబుతూనే రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఎన్నికైన పన్నీరు సెల్వానికి తాము అండగా ఉంటామని వెంకయ్య ప్రకటించడం పన్నీర్ సెల్వం-శశికళ మధ్య చిచ్చురాజేయడమే అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన శశికళ సిఎం కుర్చీనెక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

Share.

Comments are closed.