పది ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు రాజధానిలో ఒకేసారి పది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ఆయా కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమన్నారు. మీ ఎదుగుదలకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు కంపెనీ ప్రతినిధులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పది కంపెనీల ద్వారా సుమారుగా 1000 మంది యువతి,యువకులకు ఉద్యోగాలు వస్తాయి.  తక్షణం 300 మంది స్థానిక యువతి,యువకులతో కంపెనీలు ప్రారంభం అవుతున్నాయని అయన అన్నారు. బిగ్ డేటా, ఐటీ సెక్యూరిటీ, ఈఆర్పీ, బిజినెస్ అనలిటిక్స్ అందిస్తున్న    వైబర్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ,  .మొబైల్ యాప్ తయారీ లో  హెడ్ రన్ టెక్నాలజీస్,  ఇంజినీరింగ్ డిజైన్స్ అందిస్తున్న క్యాడిప్లాయ్,  ఐటీ, కన్సల్టింగ్ సేవలు అందిస్తున్న సిఎస్ఎస్ టెక్నాలజిస్, అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ తయారీ లో ఉన్న యలమంచిలి సంస్థ, అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో ఉన్న మెంటిస్, హెల్త్ కేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఉన్న నార్మ్ సాఫ్ట్ వేర్,  ఓపెన్ ట్రక్ క్యాటరర్స్ సర్వీసెస్ అందిస్తున్న ఫ్రీమోన్ట్ ఐటీ సొల్యూషన్స్ , కేపిఓ సర్వీసెస్, బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న యాక్ర్స్ ఐటీ సర్వీసెస్, గ్రాఫిక్ డిజైన్, మొబైల్ అప్లికేషన్ సేవలు అందిస్తున్న ప్రోకామ్ లు ఈ రోజు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com