పడక గదిలో మీదే పైచేయి కావాలంటే..

0

first night_apduniaశృంగార సామర్థ్యానికి అనేక శారీరక, మానసిక కారణాలు దోహదం చేస్తాయి. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యవ్వనం తొలి రోజుల్లో పురుషుల్లో ఆ వాంఛ చాలా తీవ్రంగా ఉంటుంది. రతిని నిర్వహించే శక్తి కూడా ఊహకు మించి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని కొన్ని రకాలైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఏడు పదుల వయస్సు వరకు కాపాడుకోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు. ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్‌ కూడా అటువంటిదేనని అంటున్నారు. సెక్స్‌ను అపవిత్రంగా ఎప్పుడూ భావించకూడదంటున్నారు. అయితే సెక్స్‌లో మహిళల సహకారం ఎంతో ముఖ్యమనేది మరువకూడదు.

Share.

Comments are closed.