నగదు రహిత లావాదేవీల్లో ఆర్టీసీ ముందంజ

0
APSRTC_apduniaపెద్ద నొట్ల రద్దుతో ప్రభుత్వ రంగ సంస్ధలు అన్ని నగదు రహిత లావాదేవీల వైపు మోగ్గుతున్నాయి…ప్రజరవాణా అయిన ఆర్.టి.సి ఇందులో ముందుగా అడుగులు వేస్తోంది. 2009 నుంచే ఈ బుక్కింగ్ ను అమల్లోకి తీసుకువచ్చిన ఆర్.టి.సి రానున్న రొజుల్లో నగదు రహితం వైపు అడులు ముందుకు వేస్తుంది.
నవంబరు 8… ఈ రోజును ఎవ్వరూ మర్చిపోలేరు. కారణం ఆ రోజు నుంచి 50 రోజుల పాటు బ్యాంకు, ఏటియమ్ లకు క్యూలు కట్టిన రోజులు… డబ్బులు ఉండి వాడుకొలేని పరిస్థితికి. ఈ పరిస్థితిని పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవిలపై ప్రజలను మళ్ళీంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో ప్రభుత్వాలు 60 శాతం సక్సెస్ సాధించాయనే చెప్పాలి. రానున్న రోజుల్లో క్షేత్ర స్దాయిలో కూడ నగదు రహిత లావాదేవిలపై అవగాహన కలిగిస్తే పూర్తిగా విజయం సాధించినట్లే…. ప్రభుత్వం రంగ సంస్ధలు ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవిల వైపు నడుస్తున్నారు. ప్రజలకు చేరువగా ఉండే ఆర్.టి.సి సంస్ధ ఇందులో ప్రధనంగా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే నగదు రహితంగానే రిజర్వేషన్లు, ఈ బుకింగ్ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. వీటితో పాటు రానున్న రొజుల్లో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు సైతం స్వైపింగ్ మిషన్లు ద్వారా టిక్కెట్లు ఇచ్చే విధంగా చర్యలు చెపట్టింది. ఇందుకు అవసరం అయిన మిషన్లును ఇప్పటికే ఆర్డరు ఇచ్చినట్లు ఆర్.టి.సి ఆసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు.    
మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతొ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధఃగా ఆర్.టి.సి చర్యలు చెప్పటింది. ఇదే తరహలో అన్ని ప్రభుత్వ కార్యలయాలు ముందుకు వెళ్ళవల్సిన అవసరం ఉంది.
…….
Share.

Comments are closed.