దొంగతనం అంటగట్టారని విద్యార్థిని ఆత్మహత్య

0
suicide_apdunia
సిద్దిపేటలో భవాని అనే ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సాయి చైతన్య జూనియర్‌ కాలేజీ భవనంపై నుంచి దూకిన భవాని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తోటి విద్యార్థిని డబ్బులు తీసుకుందనే నెపంతో అందరి ముందు ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్‌ చితకబాదడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన భవాని(17) పట్టణంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్‌ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తోటి విద్యార్థిని పోగొట్టుకున్న వంద రూపాయలు భవాని బ్యాగులో లభించడంతో.. కళాశాల ప్రిన్సిపల్‌ బ్రహ్మానందరెడ్డి(నందు) ఆమెను తీవ్రంగా మందలించాడు. తరగతి గదిలోని విద్యార్థులంతా చూస్తుండగా ఇది జరగడంతో.. భవాని తీవ్ర మనస్థాపానికి గురైంది. కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Share.

Comments are closed.