తిరుమలలో ఎమ్మెల్యే రోజా

తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామి వారి కైంకర్యాలలో నిమగ్నం అయ్యే అర్చక స్వాములకు రిటైర్మెంట్ ఎలా చేస్తారని టీటీడీ పాలకమండలిని రోజా ప్రశ్నిచారు. సాక్ష్యత్తూ వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులులో చూసుకుంటారని,  అలాంటి రమణదీక్షితులను విధులనుంచి తొలగించిన విధానం చాలా బాధాకరమని  అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం  రద్దుకు ఆమోదం తెలిపిన పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వనికి రోజా సూచించారు. శ్రీవారి ఆభరణాల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వాటిని జేఈవో  వచ్చిన మొదటి సంవత్సరంలొనే ఆభరణాలను ఆన్లైన్ లో పెడతామని  అన్నారు.  ఇప్పటికి 8 సంవత్సరాలు అయినా ఆభరణాల ఆన్లైన్ పై జేఈవో గారు స్పందించక పోవడం పలు అనుమలను రేకెత్తిస్తుందని రోజా విమర్శించారు.  గిరిజన శాఖ మంత్రి లేకపోవడంతోనే దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రజలపై చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని రోజా మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *