జాతీయ పతాక రూపకర్తకు జనసేన అధ్యక్షుడి నివాళి

భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్య కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉదయం హైదరాబాద్ మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య చిత్రపటానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి, జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. స్వాతంత్య్ర పోరాటంలో వెంకయ్య గారి త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు. తరువాత అయన జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా ఈ కరదీపికను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *