చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఎమ్మెల్సీ సతీష్

0

టీడీపీకి మచ్చతెచ్చే ఏ పనీ తాను చేయనని… పార్టీ కోసం, అధినేత చంద్రబాబు గెలుపుకోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని ఆ పార్టీ ఎమ్మెల్సీ సతీష్ అన్నారు. రెండు రోజుల క్రితం సూర్యలంక బీచ్ లోని హరిత రిసార్ట్స్ మేనేజర్ శ్రీనివాస్ తో పాటు అక్కడున్న సిబ్బందిపై దాడి చేసినట్టు సతీష్ పై బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న ఆయన బాపట్లకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పు చేసిన వారిని మందలిస్తే, తనపై కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భావనతోనే తాను సైలెంట్ గా ఉన్నానని… కానీ, ఎదుటి వారు చేస్తున్న విమర్శలను చూసి మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

 
Share.

Comments are closed.