'గౌతమి పుత్ర' యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన మెగా హీరో

0

sai dharam tej_apduniaబాలకృష్ణ తాజా చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నేడు థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య అభిమానులు రెండ్రోజుల ముందే సంక్రాంతి పండుగని థియేటర్ల వద్ద సెలబ్రేట్‌ చేసేసుకున్నారు. ప్రతి తెలుగోడూ గర్వంగా ఫీలయ్యేలా సినిమా తెరకెక్కిందని అభిమానులు అంటున్నారు. ఇక ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాకి సంబంధించి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ గురించి వస్తున్న రిపోర్ట్స్‌ చాలా గొప్పగా ఉన్నాయని పేర్కొంటూ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు క్రిష్‌, హీరో బాలకృష్ణను ఉద్దేశించి ‘మీరు మాలాంటి చాలామందికి ఇన్‌స్పిరేషన్‌..’ అని పేర్కొన్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఆరోగ్యకరమైన పోటీకి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి. దాదాపుగా పరిశ్రమకి చెందిన ప్రముఖులంతా నిన్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాకి ఇదే తరహాలో ట్వీట్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వంతు. మొత్తమ్మీద తెలుగు సినీ సంక్రాంతి ఈసారి ఓ రేంజ్‌లో సినీ అభిమానుల్ని అలరిస్తోందన్న మాట.

Share.

Comments are closed.