గెలుపు గుర్రాల కోసం వైసీపీ వేట

ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభానికి కేవ‌లం ప‌ది మాసాల గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో అన్ని పార్టీల్లోనూ ఎన్నిక‌ల హ‌వా ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి నుంచే కీల‌క నాయ‌కులు త‌మ టికెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకుంటున్నారు. దీంతో పార్టల్లో నేత‌ల సంద‌డి, ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా మొద‌లైంది. అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ టికెట్ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డ వైసీపీకి అభ్య‌ర్థి దొరికాడు.. అయితే, ఇప్పుడు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదురు కానుంది. రాజధాని నగరమైన విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ చేయడానికి పార్టీలో ఎంతో మంది నాయకులున్నా.. గెలిచే అభ్యర్థి ఇక్కడ లేరని.. ఎవరైతే బాగుంటుందనే దానిపై.. ఆయన పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు. గతంలో పోటీ చేసిన కోనేరు ప్రసాద్‌ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. క్రమంగా కోనేరు పార్టీకి కూడా దూర‌మ‌య్యారు. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై.. పార్టీ గత కొన్నాళ్లుగా విస్తృత కసరత్తు చేస్తోంది. పలువురు సీనియర్‌ నాయకుల పేర్లు ఇక్కడ పోటీకి పరిశీలించినా..వారు సరైన అభ్యర్థులు కారని.. టీడీపీని ఆది నుంచి సమర్థిం చే… సామాజిక వర్గానికి చెందిన వారైతేనే ఇక్కడ గెలవగలరని జగన్‌ మొదటి నుంచి భావిస్తున్నారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ అధినేత జ‌గ‌న్ ఆయనకు టిక్కెట్‌ ఖరారు చేస్తార‌ని తెలుస్తోంది. ఆయ‌నే సూప‌ర్ స్టార్ కృష్ణ సోద‌రుడు, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు, వైసీపీ అధికార ప్ర‌తినిధి ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు. ఈయ‌న ప్రధాన సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం… విజ‌య‌వాడ లోక్‌స‌భ సీటును ఈ వ‌ర్గానికే ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో ఆయ‌న‌కు ఈ సీటు దాదాపు ఖ‌రారైన‌ట్టే టాక్‌.మూడేళ్లుగా ఇక్క‌డ ఎవ‌రిని ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌పాలా ? అని వెయిట్ చేస్తోన్న జ‌గ‌న్‌కు పెద్ద స‌మ‌స్య తీరిన‌ట్టు అయింది! కానీ, అదేస‌మ‌యంలో పెద్ద బాధ్య‌త జ‌గ‌న్ నెత్తిమీద ప‌డింద‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు…తనకు చెందిన భూమిని మంగ‌ళ‌గిరి స‌మీపంలో వైసీపీ కార్యాల యానికి ఇచ్చివేసి.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడడమే తన ధ్యేయమని ప్రకటించారు. అంతేకాదు, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి ప్ర‌చారం చేయాల‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వ‌చ్చినా ఆయ‌న స్పందించ‌లేదు.మ‌రి ఇలా వైసీపీకి అంకిత భావంతో ప‌నిచేస్తూ.. ఆస్తుల‌ను సైతం రాసిచ్చిన ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావుకు టికెట్ ఇచ్చినంత మాత్రాన జ‌గ‌న్ ఆయ‌న‌కు ఏదో చేసిన‌ట్టు కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నను ఎన్నిక‌ల్లో గెలిపించుకుంటేనే జ‌గ‌న్ ప‌రువు నిల‌బ‌డుతుంద‌ని సూచిస్తున్నారు. లేక‌పోతే.. త‌న‌కు కుడి భుజంగా నిలిచిన నాయ‌కుడినే గెలిపించుకోలేక పోయార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ కీల‌క‌మైన విశాఖ సీటు నుంచి స్వ‌యంగా త‌న మాతృమూర్తి విజ‌య‌ల‌క్ష్మిని పోటీ చేయించి గెలిపించుకోలేక‌పోయార‌న్న అప‌వాదు మూట‌క‌ట్టుకున్నారు. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితిలో బెజ‌వాడ రాజ‌కీయాలు మారిపోయాయి మ‌రి వీటిని ఎదుర్కొని జ‌గ‌న్ ముందుకు ఎలా న‌డిపిస్తారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com