గుర్తుండిపోయేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలు

0

మొదటిosmania university మూడు రోజుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలను తెలంశతాబ్ధి ఉత్సవాల ఎప్పటికీ గుర్తండిపోయాలా ఏడాది పాటు కూడా ఈ ఉత్సవాలు జరపనున్నట్లు మంత్రి శ్రీహరి చెప్పారు. గాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటు,పాట్లు లేకుండా ఉండేందుకు మొత్తంగా 30 కమిటీలు కూడా వేసుకున్నట్లు చెప్పారు. ఇందులో సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీలు ముఖ్యంగా పనిచేయనున్నాయని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ, ఏ ఐసీటీయు, యుజీసీలను కూడా కలిసి ఆహ్వానించనున్నామని, అదే సందర్భంలో ఆర్ధికంగా కేంద్రం నుంచి సహాయం చేయడానికి విజ్ణప్తి చేయనున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రారంభోత్సవాల్లో 27వ తేదీన ఆలిండియా వీసీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 28వ తేదీన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ ను ఇక్కడ నిర్వహించాలన్న విజ్ణప్తికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. దీనికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని చెప్పారు.తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 2017 ఏప్రిల్ 26, 27,28 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్శిటీ కలిపి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీహరి.ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రచురణ అయిన ఉత్తమ వంద పబ్లికేషన్స్ తో పుస్తకం తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా ఉస్మానియాలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వారి పుస్తకాన్ని కూడా తీసుకువస్తామన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రను భావితరాలకు పదిలంచేసేందుకు వీడియోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి శతాబ్ది ఉత్సవాలపై స్పష్టత తీసుకుంటామని, అక్కడే ఉత్సవాల లోగో, బ్రోచర్, పోస్టర్, వెబ్ సైట్ ను విడుదల చేస్తామని చెప్పారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంసిద్ధంగా ఉన్నాయన్నారు. ఉస్మానియా కు న్యాక్ గుర్తింపు లేదన్నది వాస్తవంకాదని, రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల రెన్యువల్ చేయలేదని, మార్చిలోపు న్యాక్ గుర్తింపు రెన్యువల్ చేయిస్తామన్నారు. విద్యార్థుల మెస్ బిల్లుల బకాయిలను కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ క్లియర్ చేశారన్నారు. ఇంకా ఏమైనా సమస్యలున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్లు కొంతమంది మాత్రమే కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో విధులకు హాజరుకావడం లేదన్నారు. రాజకీయ పార్టీల చెప్పే వాటిని నమ్మితే వారే ఇబ్బందిపడుతారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు జీవో 14 ప్రకారమే 50శాతం పెంచామని, దీంతో 18వేల నుంచి 27వేలకు వేతనం పెరుగుతుందన్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించిందని, అనవసరంగా రాజకీయాల ప్రలోభాలకు గురై ఇబ్బంది పడవద్దని సూచించారు.

Share.

Comments are closed.