క్యాష్ లేస్ లావాదేవిలపై అవగాహణ

0
Digital_apduniaనగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కనీస పరిజ్ఞానం లేనివారికి సైతం ఎలా చేయాలనే విషయాన్ని ప్రత్యేక్షంగా వివరించేందుకు సంకల్పించింది. అందులో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో డిజిదన్ మేళను ఏర్పాటు చేశారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహనా కల్పించడం కోసం 80 స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. డిజిదన్ మేళాను ఏర్పాటు చేయడం వలన నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు ఒక అవగాహనా కలుగుతుంది అని అన్నారు. ఏ ప్రదేశం లో ఉన్న వారి ఫోన్లు ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ల ద్వారానే కాకుండా మాములు ఫోన్ నుండి కూడా చేల్లింపులు చేసుకోవచ్చు. ఆదార్ నెంబర్, వేలిముద్రలు ద్వారా 5 నిముషాలలో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం అని బ్యాంకు వర్గాలు తెలిపాయి. విత్తనాలు మరియు ఎరువులును రైతులు కొనుగోలు చేసుకోడానికి నగదు రహిత లావాదేవీలపై వారికి అవగాహనా కల్పిస్తున్నారు. డిజిదన్ మేళాను ఏర్పాటు చేయడం వలన నగదు రహిత లావాదేవీలను ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ మేళ ను గ్రామీణ ప్రాంతాలలో లలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అన్నారు. నగదు రహిత లావాదేవీలపై డిజిదన్ మేళను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగ ఉందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డిజిదన్ మేళను ఇంకా క్షేత్ర స్థాయి లో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు.
Share.

Comments are closed.