కోహ్లీ సేనదే సిరీస్…

0

గత నెల 21 నుంచి భారత్ మరియు విండీస్ మధ్యలో మొదలయిన 5 మ్యాచుల వన్డే సిరీస్ ఈ రోజుతో పూర్తయ్యిపోయింది.ప్రారంభంలో రెండు మూడు మ్యాచులు రసవత్తరంగా సాగినా చివరి రెండు మ్యాచుల్లో మాత్రం విండీస్ ఆటగాళ్లు భారత్ ఆటగాళ్ల ధాటికి నిలవలేకపోయారు.నాలుగో మ్యాచులో బౌలర్లు చేతులెత్తేస్తే చివరి ఐదో మ్యాచులో మాత్రం బాట్స్మెన్ లు చేతులెత్తేశారు.మన బౌలర్ల దెబ్బకి విండీస్ ఆటగాళ్లు కేవలం 104 పరుగులకే కుప్పకూలిపోయారు.

దీనితో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిపోయింది.స్పిన్ బౌలర్ జడేజా మళ్ళీ తన బౌలింగ్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి విండీస్ కు చెమట్లు పట్టించాడు.ఇక బ్యాటింగ్ కి దిగిన మన ఆటగాళ్లు మొదట్లోనే ధావన్ వెనుదిరిగినా రోహిత్ శర్మ మాత్రం మరో సారి విండీస్ బౌలర్లను చీల్చి చెండాడేసాడు.దీనితో మళ్ళీ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకొని విజయాన్ని పూర్తి చెయ్యడంలో కీలక పాత్ర పోషించాడు.ఏదో జరుగుతున్న మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయ్యిపోయింది.ఇక ఈ నెల 4 నుంచి ఇరు జట్ల మధ్య జరగబోతే టీ 20 మ్యాచుల్లో అసలైన పోరు ఉంటుంది.

Share.

About Author

Leave A Reply