కోర్టు ఆదేశాలతో కోడి పందేలు, జల్లికట్టుకు బ్రేక్ పడుతుందా?

0

kodi pandelu_apduniaసంక్రాంతి పండగ వస్తే తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, తమిళనాడులో జల్లికట్టు సందడి కనిపిస్తుంది. కోడిపందేలపై హైకోర్టు, జల్లి కట్టుపై సుప్రీం కోర్టు ఇప్పటికే నిషేధం విధించాయి. ఆరు నూరైనా కోడి పందేలను నిర్వహించి తీరుతామని పందెం రాయుళ్లు ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలో భీష్మించుకుని కూర్చున్నారు. జల్లికట్టు ప్రభావం ఏపీలోని చిత్తూరు జిల్లా పైనా ఉంటుంది. చిత్తూరులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు ఆడుతారు. సుప్రీం కోర్టు జల్లికట్టుని నిషేధించిన నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళలను జరుగుతున్నాయి. జల్లికట్టు, కోడి పందేలు సంప్రదాయంగా వస్తున్న క్రీడలని, పందెం రాయుళ్లు వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో కోడిపందేలు జరుగుతాయా? లేదా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా పోలీసులు కోడిపందేలు అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఏపీలోని కొన్ని ప్రాంతాలలో బాగా పేరు మోసిన రాజకీయ నాయకులే దగ్గరుండి కోడి పందేలను జరిపించడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏపీలో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందేలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Share.

Comments are closed.