ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

సంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి అధికారిని వలవేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు… నాగల్ గిద్ద మండలం ఔదాపూర్ పంచాయతీ సెక్రెటరీ షరీఫ్ ని స్థానిక ఎంపీపీ ఆఫీసులో కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ ప్రతాప్ కుమార్ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగల్ గీద్ద మండలం ఔదత్ పూర్ గ్రామ సర్పంచ్ తండ్రి మల్లికార్జున్ వద్ద గ్రామంలో చేసే అభివృద్ధి పనులకు కాంట్రాక్టు ఎం బీ రికార్డు చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా 90 వేలకు ఒప్పందం కుదుర్చుకొని, 20వేల నగదు 70 వేల చెక్కు ఇచ్చేందుకు సిద్ధపడి సమాచారాన్ని అవినీతి నిరోధక అధికారులకు అందించడంతో ముందుగానే ఎంపీపీ కార్యాలయం వద్ద కాపుకాసి మల్లికార్జున్ నుండి డబ్బులు తీసుకుంటుండగా షరీఫ్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com