ఇక విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు

0

air india_apduniaబస్సులో, రైళ్లలో మాదిరి విమానంలోనూ స్త్రీలను గౌరవించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే విమానంలో ముందు వరుసల్లో ఆరు సీట్లను మహిళా ప్రయాణికులకు కేటాయించాలని భావిస్తోంది. త్వరలోనే నేషనల్ క్యారియర్ ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఎలాంటి అదనపు చార్జీలూ లేకుండా మహిళల రక్షణార్థం మొదటి వరుసల్లో ఆరు సీట్లను వారికి కేటాయించనున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. ప్రపంచంలోనే మొదటిసారి విమానంలో ముందు సీట్లను మహిళలకు కేటాయిస్తున్నామని ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహాని చెప్పారు. ఇతర రవాణా సేవలందిస్తున్న స్థానిక, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, మెట్రోలు, బస్సులు, మహిళల కోసం ప్రత్యేకంగా బెర్త్లను, సీట్లను లేదా కోచ్లను కేటాయిస్తున్నాయి. గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో పింక్ ఆటో రిక్షాలను ప్రత్యేకంగా మహిళ కోసం ప్రారంభించారు. అదేవిధంగా ఎయిర్క్రాఫ్ట్లోని ఎకనామిక్ క్లాస్లో మూడో వరుసను, ఆరు సీట్లను ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు కేటాయించనున్నామని ఎయిరిండియా జనరల్ మేనేజర్-రెవెన్యూ మేనేజ్మెంట్ మీనాక్షి మాలిక్ చెప్పారు. మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే తమ కర్తవ్యమని, చాలామంది మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణిస్తుంటారని, వారికోసం ఈ సీట్లను రిజర్వు చేస్తున్నామని నేషనల్ క్యారియర్ వెల్లడించింది.

Share.

Comments are closed.