ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తోనే దూరం

కాస్టింగ్ కౌచ్.. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న అంశం. సినీ రంగంలో లైంగిక వేధింపులపై ఒక్కో తార గళం విప్పుతూ సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి ఉదంతంతో వెలుగులోకి వచ్చిన ఈ కాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది తారలు స్పందించారు. కొంత మంది నిర్మాతలు అర్ధరాత్రుళ్లు తనను తమ గదికి రమ్మనేవారని చెప్పి బాలీవుడ్ తార మల్లికా శెరావత్ ఇటీవలే సంచలనానికి తెరతీశారు. హీరోలతో అలా ఉండనందుకే తనకు పలు కీలక పాత్రలు దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కథానాయిక అదితి రావు హైదరీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై తన గళం విప్పారు. బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దాని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని అదితి చెప్పారు. కాస్టింగ్ కౌచ్ కారణంగానే తాను చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తీవ్రంగానే ఉన్నాయని చెప్పిన అదితి.. పేర్లు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. 2006లో ఓ మలయాళ సినిమా ద్వారా నటిగా పరిచయమైన అదితి ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు సినిమాలకు దూరమయ్యారు. దీనికి గల కారణాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘నేను సినిమాలోకి వచ్చి పదేళ్లు దాటింది. కాస్టింగ్ కౌచ్ కారణంగానే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. కెరీర్ ఆరంభంలో ఓ బాలీవుడ్ నిర్మాత నా దగ్గరకు వచ్చాడు. ఆఫర్ ఇస్తానని, కాంప్రమైజ్ కావాలని కోరాడు. నాకు చాలా కోపం వచ్చింది’ అని ఆమె తెలిపారు. తప్పుడు దారుల్లో అవకాశాలు దక్కించుకోవడం తనకు అవసరంలేదని, తన ప్రతిభనే నమ్ముకున్నానని అదితి చెప్పారు. చాలా రోజులు ఖాళీగా ఉండిపోయినా.. ప్రతిభ ఉండి, నిజాయతీగా ఉంటే సినిమాల్లో రాణించవచ్చని తెలుసుకున్నానని ఆమె అన్నారు. ఆ తర్వాత అవకాశాలు వాటంతటవే అవే తలుపుతట్టాయని వెల్లడించారు.హైదరాబాద్ బ్యూటీ అదితి రావు తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం వరస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com