అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన ఛీఫ్ విప్ పల్లె

పుట్టపర్తి నగర పంచాయతీ లోని ఎనుములపల్లి వద్ద ఈ రోజు రూ. 30 లక్షల తో అన్న క్యాంటీన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి  భూమి పూజా చేసారు. వేదపండితుల మంత్రోచ్చ రణ నామాల మధ్య భూమి పూజ జరిగింది. పల్లె మాట్లాడుతూ పేదల ఆకలి  తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేసారని అన్నారు. నిరుపేదలకు కూడు, గూడు,గుడ్డ అందించాలన్నదే స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ ఆశయం . న్టీఆర్ ఆశయ సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. పుట్టపర్తి లో పేదలకు తక్కువ డబ్బుతో కడుపునిండా   ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com