అనాథ పిల్లలతో ఆడిపాడిన "అందాల రాక్షసి"

0

lavanya-tripati-apdunia“అందాల రాక్షసి” సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఫస్ట్ మూవీతోనే మంచి నటిగా పేరు తెచ్చుకొంది. తన సినీ కెరీర్ లో “భలే భలే మగాడివోయ్”, “సోగ్గాడే చిన్నినాయన” వంటి డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ అందుకొంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాలో నటిస్తోంది. ఈ అందాల రాక్షసి తనకు అందంతో పాటు అందమైన మనసు కూడా ఉందని నిరూపించింది. బిజీ షెడ్యూల్ సమయంలోనూ లావణ్య త్రిపాఠి గన్నవరంలోని “డాడీ” అనాథ ఆశ్రమంలో గడిపింది. అనాథ పిల్లలతో ఆడిపాడింది. అక్కడ పిల్లలు చెప్పిన కథలు వింటూ ఎంతో ఎంజాయ్ చేసింది. అంతేకాదు డాడీ అనాథ ఆశ్రమం నిర్వహణ కోసం తాను ఆర్థిక సాయం చేస్తానని, తరచూ ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కొద్ది సమయం గడుపుతానని చెప్పింది.

Share.

Comments are closed.